Beauty Tips

Coffee And Egg:కాఫీ పొడి+గుడ్డు కలిపి జుట్టుకి పట్టిస్తే ఏమి అవుతుందో తెలుసా?

Hair fall with coffee powder and egg : వాతావరణంలో వచ్చే మార్పులు, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, తల స్నానం చేసి సమయంలో చేసే పొరపాట్లు వంటి అనేక కారణాలతో జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో జుట్టు రాలే సమస్య ఒకటి.
hair fall tips in telugu
జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో దొరికే ఎటువంటి ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇంటిలో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో చాలా సులభంగా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ రెమిడీ కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.
Eat Egg Yellow
ఒక బౌల్ లో నాలుగు స్పూన్ల కాఫీ పౌడర్, రెండు స్పూన్ల బాదం నూనె, రెండు ఎగ్స్ బ్రేక్ చేసి వేసి బాగా కలపాలి. అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి షవర్ క్యాప్ వేసుకోవాలి. ఒక గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చాలా తొందరగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. కాఫీ పొడి, egg రెండు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటాయి. కాఫీలో ఉండే కెఫీన్ తల మీద చర్మం మీద రక్తప్రసరణను పెంచి జుట్టు కుదుళ్లను ఉత్తేజపరచి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
Hair Care
Egg లో ప్రోటీన్ మరియు బయోటిన్ సమృద్దిగా ఉండుట వలన జుట్టుకి అవసరమైన తేమను అందిస్తుంది. అలాగే జుట్టుకి కండిషనింగ్ చేయడం ద్వారా జుట్టు బ్రేక్ అవ్వకుండా కాపాడుతుంది. ఈ ప్యాక్ జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.