Kitchenvantalu

Capsicum Egg Rings Recipe:కోడి గుడ్డు కాప్సికం రింగ్స్ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

Capsicum Egg Rings Recipe: ఎగ్ లో వెరైటీస్ కోరుకునే వారు అమ్లేట్స్ లో ఎన్నో స్పెషల్స్ చేసుకోవొచ్చు.క్యాప్సికం రింగులతో ఎగ్ ఆమ్లెట్ చేస్తే పిల్లలు చాలా ఇంట్రెస్టింగా తింటారు. ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
క్యాప్సికం -3
గుడ్లు -3
ఉప్పు -1/2 టీ స్పూన్
చిల్లీ ఫ్లెక్స్ – ½ టీ స్పూన్
పచ్చిమిర్చి – 1
కొత్తిమీర – 1 టేబుల్ స్పూన్
శనగపిండి – 1 ½ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
కొత్తిమీర – ¼ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
నూనె – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.క్యాప్సికం తీసుకోని ½ అంగులం చొప్పునా రింగులుగా కట్ చేసుకోవాలి.
2.ఒక గిన్నెలో గుడ్లను సొనను వేసుకోని బాగా బీట్ చేసుకోవాలి.
3.ఇప్పుడు అందులోకి ఉప్పు ,చిల్లిఫ్లెక్స్ ,కొత్తిమీర,శనగపిండి,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా బీట్ చేసుకోవాలి.
4.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని 1 టీ స్పన్ ఆయింల్ వేసి వేడెక్కనివ్వాలి.

5.వేడెక్కిన పెనం పై క్యాప్సికం రింగులను పెట్టుకోని ఎగ్ మిశ్రమాన్ని క్యాప్సికం రింగ్స్ లో వేసుకోవాలి.
6.ప్యాన్ పై మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి.
7. ఆమ్లెట్ ఒక వైపు వేగాక..క్యాప్సికం రింగులను మరో వైపు తిప్పుకోని కాల్చుకోవాలి.
8.అంతే వెరైటీ క్యాప్సికం రిగ్స్ ఆమ్లెట్ రెడీ.