Kitchenvantalu

Saggubiyyam Semiya Payasam Recipe:పాతకాలం నాటి సగ్గుబియ్యం సేమియా పాయసం ఇలా చేయండి

Saggubiyyam Semiya Payasam Recipe: తక్కువ టైం ఎక్కువా ఇష్టపడే స్వీట్ సేమియా పాయసం. పండగలు,పూజలు,స్పెషల్ అకేషన్ ఏదైనా సరే సేమియా పాయసంతో రోజు మొదలు పెట్టేస్తా. సేమియా పాయసం లోకి వంటికి చలువ చేసే సగ్గుబియ్యం కలిపి ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
సేమియా – ½ కప్పు
సగ్గుబియ్యం – ½ కప్పు
చక్కెర – 1 కప్పు
జీడిపప్పు – 1 టేబుల్ స్పూన్
బాదం – 1 టేబుల్ స్పూన్
ఎండుద్రాక్ష – 1 టేబుల్ స్పూన్
పాలు – 3 కప్పులు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి – 3

తయారీ విధానం
1.ముందుగా సగ్గుబియ్యం శుభ్రంగా కడి గంటపాటు నానబెట్టుకోవాలి.
2.ఇప్పుడు బాండీలో రెండు కప్పుల నీళ్లు పోసి నానబెట్టుకున్న సగ్గుబియ్యంవేసి ఉడకించుకోవాలి.
3.వేరోక ప్యాన్ లో నెయ్యి వేసి అందులోకి డ్రై ఫ్రూట్స్ ని వేపుకోని పక్కన పెట్టకోవాలి.
4.ఇప్పుడు అదే ప్యాన్ లో మరికొంచెం నెయ్యి వేసి సేమియాను వేపుకోని పక్కనపెట్టుకోవాలి.
5.అదే ప్యానోలోకి 3 కప్పుల పాలు పోసి మరగనివ్వాలి.అవసరం అనుకుంటే నీళ్లు యాడ్ చేసుకోవచ్చు.

6.మరుగుతున్న పాలలో ఉడికించిన సగ్గుబియ్యం వేసి బాగా కలుపుకోవాలి.
7.సగ్గుబియ్యం ఉడుకాక సేమియాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
8.5-6 నిమిషాలు ఉడికించుకున్నాక అందులోకి చక్కెర కరిగించాలి.
9.చివరగా యాలకుల పొడి,డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
10.అంతే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ.