Kitchenvantalu

Kitchen Tips:ఇల్లాలికి ఉపయోగపడే ఎంతో సులువైన వంటింటి చిట్కాలు.

Useful Kitchen Tips in telugu:వంట చేసే సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే వంట రుచి పెరగటమే కాకుండా వంట కూడా చాలా త్వరగా అవుతుంది. ఇప్పుడు కొన్ని వంటింటి చిట్కాలను తెలుసుకుందాం.

బఠాణీలను ఉడికించే సమయంలో ఆ నీటిలో కొంచెం పంచదార కలిపితే రుచి పెరుగుతుంది.

టమోటా కూర చేసినప్పుడు కొంచెం పంచదార వేస్తె కూర రుచి పెరుగుతుంది.

వేపుడు చేసినప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలంటే నూనెలో కొంచెం ఉప్పు కలపాలి.

మాడిన పాత్రలలో నీటిని పోసి బట్టల సోడా వేసి మరిగిస్తే మూడు అంతా తొలగిపోతుంది.

బంగాళాదుంపలు ఉడికాక కూడా తెల్లగా ఉండాలంటే ఉడికించే ముందు కాస్త పటిక పొడి వేస్తే సరి.ముఖ్యంగా ఈ చిట్కా బంగాళదుంప చిప్స్ చేసినప్పుడు బాగా సహాయపడుతుంది.

గోదుమలు ఎక్కువగా తెచ్చుకుంటే పురుగు పడుతుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే గోధుమలలో ఎండిన మెంతి ఆకుల్ని వేయాలి.

పసుపు కలిపిన నీటిలో కూరగాయల ముక్కలను వేస్తే పురుగులుంటే నీళ్ళపై తేలుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.