Tollywood: స్టార్ హీరోలకు ఉన్నఅలవాట్లు…అసలు నమ్మలేరు
Tollywood Star Heroes qualities : సినిమా హీరోల గురించి ఏ విషయం తెలిసిన అభిమానులు ఆనందపడతారు. సినిమాల హీరోలు తెర మీద నవరసాలు పండిస్తూ తమ నటనతో ఆకర్షిస్తారు. తమకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంటారు. అయితే కొంత మంది మాత్రం సినిమాల్లో ఉండే క్వాలిటీస్ కు సంబంధం లేకుండా బయట వ్యవహరిస్తూ భిన్నంగా ఉంటారు.
మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు తనయుడిగా నటవారసునిగా అడుగుపెట్టిన హీరో వెంకటేష్ తన టాలెంట్ తో విక్టరీ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఎలాంటి పాత్రలు వేసినా, పాజిటివ్ థింకింక్, దైవ చింతన వెంకీకి ఎక్కువ. పైగా ఎక్కువగా పుస్తకాలు చదువుతాడు. అతడితో మాట్లాడితే ఎదుటి వారికి కూడా పాజిటివ్ ఆలోచనలే వస్తాయని చాలా మంది చెప్పేమాట.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన టాలెంట్ తో పవర్ స్టార్ గా ఎదిగాడు. కామ్ గా తన పని తాను చేసుకోవడం, సిప్లిసిటీ గా ఉండడం, వ్యవసాయం చేయడం, పుస్తకాలు చదవడం ఆయనకున్న మంచి లక్షణాలుగా చెబుతారు.
మెగాస్టార్ తనయుడిగా వచ్చిన రాంచరణ్ వివాదాలకు దూరంగా ఉంటూ, బయట అంతగా కనిపించడు. తన పని తాను సైలెంట్ గా చూసు కుంటాడు.
రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటవారసునిగా వచ్చి తన టాలెంట్ తో ఇంకా చెప్పాలంటే బాహుబలితో ఆల్ ఇండియాలో నే కాదు వరల్డ్ వైడ్ గుర్తింపు పాండియన్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇండస్ట్రీలోని చాలా మందితో ఫ్రెండ్లీగా ఉంటూ,తన ఇంటికి వచ్చిన వారి స్వయంగా వంట చేసి పెడతాడట.
నటశేఖర్ కృష్ణ నటవారసునిగా ఎంట్రీ ఇచ్చి,తన టాలెంట్ తో టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబుకు సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ అని చెబుతారు. ఒక్కో సారి దాన్ని తట్టుకోలేరట కూడా. తనతో ఉంటే పంచ్ డైలాగులతో మురిపిస్తాడట.
నందమూరి వంశం నుంచి వచ్చిన హరికృష్ణ తనయుడు జూనియర్ ఫ్యాన్స్ ను ప్రేమించడంలో నెంబర్ వన్ లో ఉంటాడు. ప్రతి సినిమా వేడుకలో ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా మాట్లాడతాడు. నేచురల్ స్టార్ చాలా ప్రశాంతంగా ఉంటూ,పంచ్ డైలాగులతో జనాలలో నవ్వుల పువ్వులు పూయిస్తాడు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా నటుడు మంచు మనోజ్ సినిమా ఇండస్ట్రీలో అందరితో చాలా ఫ్రెండ్లీ గా మూవ్ అవుతాడు.