Beauty Tips

Dandruff:ఇలా చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి 3 రెట్లు వేగంగా జుట్టు పెరుగుతుంది

Hair Fall And Dandruff Home Remedies : చుండ్రు ఒక్కసారి వచ్చిందంటే తొందరగా తగ్గదు. ప్రారంభ దశలో ఉన్నప్పుడే చుండ్రు సమస్య నుండి బయట పడాలి. లేకపోతే జుట్టు రాలే సమస్య వస్తుంది. అలాగే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. చుండ్రు సమస్య పరిష్కారానికి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు.

ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే చుండ్రు,జుట్టు రాలే సమస్య నుంచి చాలా సులభంగా బయట పడవచ్చు. ఈ రెమిడీ కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. రాత్రి సమయంలో రెండు స్పూన్ల మెంతులలో నీటిని పోసి నానబెట్టాలి.

మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో రెండు స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

ఈ చిట్కాను ఫాలో అవ్వుతూ కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. దువ్వెనలను వారానికి ఒకసారి వేడి నీటితో శుభ్రం చేయాలి. ఒకరి దువ్వెనను మరొకరు వాడకూడదు. కొబ్బరి నూనె తలకు రాసినప్పుడు సున్నితంగా మసాజ్ చేయాలి. తలస్నానానికి షాంపూలు, సబ్బులు ఉపయోగించకుండా, కుంకుడు కాయల రసం లేదా పొడి, సీకాయ పొడిని వాడితే చాలా మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.