Healthhealth tips in telugu

పరగడుపున ఒక గ్లాస్ Garlic Water త్రాగితే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?

Garlic Water Health benefits In telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలసిన అవసరం ఉంది. దీని కోసం మనం ఇంట్లోనే ఒక డ్రింక్ తయారు చేసుకుని తాగవచ్చు. ఈ డ్రింక్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీని కోసం మనం వెల్లుల్లిని ఉపయోగిస్తున్నాం.

వెల్లుల్లిలో ఉండే లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచటమే కాకుండా ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుంది. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి తొక్క తీసిన మూడు వెల్లుల్లి రెబ్బలను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని ఉదయం పరగడుపున తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అలాగే వెల్లుల్లిని మరో రకంగా కూడా తీసుకోవచ్చు. రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో మూడు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి వేయాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగాలి. వెల్లుల్లిని కూడా తినవచ్చు. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తాగకూడదు. బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగాలి. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి.

దీనివల్ల శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరచటంతో పాటు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు మన శరీర బరువును నియంత్రించడానికి దోహదపడతాయి. అలాగే రక్తప్రసరణను వేగవంతం చేసి రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.