Household Tips:వీటిని ఫ్రిజ్‌లో పెడితే ఏమి అవుతుందో తెలుసా…నమ్మలేని నిజాలు
Storing foods in fridge : ప్రస్తుతం ప్రతి ఇంటిలోనూ ఫ్రిజ్ ఉంటుంది. ఫ్రిజ్ లో కూరగాయలు, పండ్లు, ఆహారాలను నిల్వ చేస్తూ ఉంటారు. అయితే కొన్నింటిని ఫ్రిజ్ లో పెట్టకూడదు. వాటి గురించి తెలుసుకుందాం. ఆలివ్ ఆయిల్ ను ఫ్రిజ్ లో పెడితే హాని కారక క్రిములు అందులోకి చేరతాయి. గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పెట్టాలి
బంగాళాదుంపల్ని కూడా ఫ్రిజ్లో పెట్టకూడదు. ఫ్రిజ్ లో పెట్టడం వలన వాటిలో ఉండే పిండి పదార్థం మరింత తియ్యగా మారుతుంది. కాబట్టి గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే బంగాళదుంపలను ఉంచాలి. అరటి పండ్లను కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఫ్రిజ్ లో పెట్టడం వల్ల పొటాషియం తగ్గుతుంది. అలాగే దానికి ఉన్న సహజసిద్ధమైన రుచి పోతుంది. కాబట్టి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి
ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల తేమ చేరి తొందరగా బూజు పట్టే అవకాశం ఉంది. కూరగాయలతో కూడా కలిపి పెట్టకూడదు. ఎందుకంటే ఉల్లిపాయ నుంచి వచ్చే వాసన కారణంగా కూరగాయలు తొందరగా పాడవుతాయి. కాబట్టి ఉల్లిపాయలను వేరుగా ఉంచాలి. కొంతమంది తేనెను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. స్వచ్ఛమైన తేనె బయట ఉన్నా పాడైపోదు. అదే ఫ్రిజ్‌లో పెడితే దాని లక్షణం మారిపోతుంది. తేనె గడ్డకట్టి చక్కెరలా మారిపోతుంది.
మల్లెపూలు, లిల్లీ వంటి పువ్వులను కూడా ఫ్రిజ్‌లో పెట్టుకోవద్దు. వీటి వాసనకు ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలు పాడైపోతాయి. అలాగే పచ్చళ్లు కూడా చల్లదనం వల్ల తొందరగా పాడైపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.