Kitchenvantalu

Kitchen Tips:ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడే సులభమైన వంటింటి చిట్కాలు

Telugu Kitchen Tips:వంట చేసే సమయంలో కొన్ని చిట్కాలను ఫాలో అయితే వంట తొందరగా అవ్వటమే కాకుండా వంట రుచిగా కూడా ఉంటుంది. ఆ చిట్కాలను వివరంగా తెలుసుకుందాం.

వేపుళ్ళు చేస్తున్నప్పుడు చెంచా వెనిగర్ చేర్చితే కూరగాయలు నూనె ఎక్కువగా పీల్చకుండా వుంటాయి.

ఆమ్లెట్ పొంగినట్టు రావాలంటే, చిటికెడు పంచదార లేదా మొక్కజొన్న పిండి కలిపితే సరిపోతుంది.

సాక్సులు నానబెట్టిన నీటిలో వంటసోడా, నిమ్మ రసం కలిపితే మురికి చాలా సులభంగా తొలగి చక్కగా శుబ్రపడతాయి.

పుస్తకాల బీరువాలో చిన్న చిన్న గంధపు చెక్కలను ఉంచితే పురుగులు దరిచేరవు.

కొద్దిగా పెర్ ఫ్యుమ్ కలిపినా నీటితో స్టీమ్ ఐరన్ చేసినట్లైతే, దుస్తులు రోజంతా సువాసనలు వెదజల్లుతాయి.