Beauty Tips

Hair Fall Tips;ఈ ఆకుల పేస్ట్ లో ఈ ఆయిల్‌ కలిపి రాస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య అనేవి అసలు ఉండవు

Bhringraj oil Benefits In telugu : ఈ మధ్య కాలంలో వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకు సంబంధించిన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. జుట్టు రాలటం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
Hibiscus leaf
ఈ సమస్యలు రాగానే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అయితే వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి Bhringraj Oil చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆయిల్ ని ఎలా ఉపయోగించాలో వివరంగా చూద్దాం.
shikkaya hair fall
ముందుగా 8 మందార ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో 3 స్పూన్ల Bhringraj Oil, ఒక స్పూన్ శీకాయ పొడి వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
White Hair Tips
ఈ మధ్య కాలంలో చుండ్రు సమస్య కూడా చాలా ఎక్కువగానే కనపడుతుంది. చుండ్రు సమస్య ఉన్నవారు Bhringraj Oil ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఒక బౌల్ లో నాలుగు స్పూన్ల ఉసిరి కాయ‌ల పొడి మ‌రియు ఆరు స్పూన్ల Bhringraj Oil వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కాస్త ఓపికగా శ్రద్దగా ఈ చిట్కాను ఫాలో అయితే జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య అన్నీ తొలగిపోయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే తెల్లజుట్టును నల్లగా కూడా మారుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.