Kitchenvantalu

Corn Palak Khichdi:కార్న్ పాలక్ కిచిడి.. తక్కువ టైం లోనే సూపర్ టేస్టీ గా ఇలా చేయండి

Corn Palak Khichdi:ఎన్నో పోషకాలు ఉన్న ఈ కిచిడి తయారుచేయటం చాలా సులభం. ఒకసారి చేస్తే పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. దీనికి కావలసిన పదార్ధాలు మరియు తయారి విధానం తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు
4 కప్పులు తరిగిన పాలకూర
1 కప్పు బాస్మతి బియ్యం
1/2 టీస్పూన్ పెసర పప్పు
2 కప్పుల స్వీట్ కార్న్
పసుపు పొడి
ఉప్పు
2 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1 కప్పు ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి)
1/2 కప్పు టమోటాలు (సన్నగా తరిగినవి)
కారం
గరం మసాలా
ధనియాల పొడి
దాల్చిన చెక్క1
లవంగాలు2
ఏలకులు 2
2 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి
2 టేబుల్ స్పూన్లు కరివేపాకు
2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి సన్నగా తరిగిన
పచ్చిమిర్చి (సన్నగా తరిగిన)

తయారి విధానం
ఒక గిన్నెలో బియ్యం మరియు పప్పును వేసి శుభ్రంగా కడిగి నీటిని పోసి 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్‌ని తీసుకుని పసుపు పొడి, ఉప్పు, 2 కప్పుల స్వీట్‌కార్న్ మరియు 2 కప్పుల నీళ్లతో పాటు నానబెట్టిన బియ్యం మరియు పప్పును వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు లేదా మూడు విజిల్స్ వరకు ఉడికించాలి. పాలకూరలో నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. నాన్-స్టిక్ పాన్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనెను వేసి వేడి చేసి అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి.

ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు మరియు టొమాటోలను వేసి మీడియం మంట మీద మూడు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత స్వీట్ కార్న్ వేసి కలపాలి. ఆ తర్వాత పాలకూర పేస్ట్,కారం, గరం మసాలా మరియు ధనియాల పొడి, దాల్చిన చెక్క,లవగాలు,యలకులు వేసి బాగా కలపాలి.

ఆ తర్వాత ఉడికించిన పప్పు-బియ్యం మిశ్రమాన్ని ఉప్పు మరియు 2 కప్పుల నీటితో కలపండి. మిశ్రమాన్ని అప్పుడప్పుడు కలుపుతూ 3-4 నిమిషాలు ఉడికించాలి. అంతే స్వీట్ కార్న్ పాలక్ కిచిడి రెడీ.