Kitchenvantalu

Anjeer Badam Milkshake:వేడిని తగ్గించి ఎనర్జీని ఇచ్చే అంజీర్ బాదం మిల్క్ షేక్

Anjeer Badam Milkshake:పోషకాలతో నిండిన ఈ మిల్క్ షేక్ ని తాగితే మన శరీరానికి అవసరమైన పోషకాలు అంది నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. దీనికి కావలసిన పదార్ధాలు మరియు తయారి విధానం తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు
2 కప్పులు అంజీర్(ముక్కలు)
10-12 బాదంపప్పులు
1 అరటిపండు
2 కప్పుల పాలు
తేనె/చక్కెర (సరిపడా)
ఉ ప్పు
ఐస్ క్యూబ్స్

తయారి విధానం
అంజీర్ మరియు అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. బ్లెండర్‌లో అంజీర్ ముక్కలు,అరటి పండు ముక్కలు,బాదం పప్పు, పాలు, తేనే లేదా పంచదార వేసి బ్లెండ్ చేయండి.

దీనిలో చిటికెడు ఉప్పు వేస్తే రుచి బాగుంటుంది.ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి షేక్ ను స్మూత్ గా అయ్యే వరకు బ్లెండింగ్ చేయాలి. అంతే అంజీర్ బాదం మిల్క్‌షేక్ సర్వ్ చేయడానికి రెడీ.