Hair Care Tips:జుట్టు రాలిపోతుందా….అయితే చక్కటి పరిష్కారం ఉల్లిరసం
Onion Juice for Hair :ప్రస్తుత కాలంలో అందంగా ఉండడం కోసం, అందంగా కనిపించడం కోసం చాలామంది వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ విషయంలో స్త్రీ, పురుష బేధం లేదు. అయితే అందం విషయానికి వస్తే ముఖంతోపాటు ప్రధానంగా చెప్పుకోదగినవి శిరోజాలు. శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఎవరైనా ఇట్టే ఆకర్షింపబడతారు. ఈ క్రమంలో ఒత్తైన జుట్టు కోసం ఉల్లిపాయ రసం బాగా పనిచేస్తుందని అంటున్నారు.
ఈ చిట్కాలను కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా పాటింవచ్చు. దీంతో చక్కని శిరోజాలు వారి సొంతమవుతాయి. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ అనే మూలకం జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అందుకే కొన్ని ఉల్లిపాయలను తీసుకుని వాటిని మెత్తని పేస్ట్ లా చేయాలి. ఆ పేస్ట్ను తల కుదుళ్లకు తగిలేలా రాయాలి. తరచూ ఇలా చేస్తుంటే తలపై ఊడిపోయిన వెంట్రుకలు మళ్లీ పెరుగుతాయి.
అంతేకాదు వెంట్రుకలు దృఢంగా, ఒత్తుగా ఉంటాయి.ఉల్లిపాయలను బాగా దంచి ఆ మిశ్రమంలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఇతర ఏవైనా ఆయిల్స్ ను కలిపి రాసుకోవాలి. దీంతో శిరోజాలు బాగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢమై వెంట్రుకలు బలంగా, కాంతివంతంగా ఉంటాయి.
ఉల్లిపాయలను మెత్తగా దంచి వాటి నుంచి తీసిన రసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు తగిలేలా పట్టించాలి. అనంతరం 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. తరువాత తలస్నానం చేయాలి. రెగ్యులర్ గా ఈ టిప్ ను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు. శిరోజాలు కూడా కాంతివంతమవుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.