Healthhealth tips in telugu

Joint Pain:పిండిలో ఇది కలిపితే …ఎముకల బలహీనత,ఊబకాయం,కీళ్ల నొప్పుల నుండి బయట పడవచ్చు

Nuvvulu Joint Pain Home Remedies In Telugu : ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఎదో ఒక సమస్య వస్తూనే ఉంది. తీసుకొనే ఆహారం సరిగ్గా లేకపోతె శరీరం లోపల గ్యాస్,ఆర్థరైటిస్, డయాబెటిస్ వంటి అనేక రకాల వ్యాధులు వస్తాయి. అలాగే శరీరం బలహీనంగా మారిపోతుంది. కాల్షియం లోపం కారణంగా ఐరన్ లోపం కూడా మొదలవుతుంది.

ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. శరీరంలో రక్తం లేకపోవటం వలన ఉదయం లేవగానే అలసట గా ఉండి ఏ పని చేయటానికి ఆసక్తి ఉండదు. ఇప్పుడు చెప్పే చపాతీలను తింటే ఈ సమస్యల నుండి బయట పడవచ్చు. దీని కోసం ఒక పొడిని తయారుచేసుకోవాలి.

ఈ పొడి కోసం ముందుగా ఒక మిక్సీ జార్ లో ఒక స్పూన్ వాము, 2 స్పూన్ల ఆవిసే గింజలు, ఒక స్పూన్ తెల్ల నువ్వులు, అరస్పూన్ శొంఠి పొడి వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిని ఒక కప్పు గోదుమపిండిలో వేసి నీటిని పోసి చపాతీ పిండిలా కలపాలి. ఒక గంట అయ్యాక చపాతీ చేసుకోవాలి. ఈ చపాతీలను తీసుకుంటే కాల్షియం లోపం ఉండదు.

అదే సమయంలో, కీళ్ళ మధ్య శబ్దం ఉన్నవారికి, ఆర్థరైటిస్ సమస్య ఉన్న వారికి కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. పిల్లలకు పెడితే ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. శారీరకంగా బలంగా ఉంటారు. మీ ఇన్సులిన్ స్థాయి కూడా నియంత్రణలో ఉంటుంది. మీకు రక్తహీనత సమస్య ఉంటే ప్రతి రోజు ఈ చపాతీలను తినాలి. అధిక బరువు, థైరాయిడ్ సమస్యలు కూడా తగ్గుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.