Healthhealth tips in telugu

Sciatica pain: సయాటికా,నడుము నొప్పి,నరాల బలహీనత,డిస్క్ సమస్యలు అన్ని మాయం

sciatica pain home remedies In Telugu : ఈ రోజుల్లో కీళ్ళ నొప్పులు,ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు అంటూ వివిధ రకాల నొప్పులతో బాధపడేవాళ్లు చాలామంది ఉన్నారు. అందులో సయాటికా నొప్పితో బాధపడేవారి సంఖ్య ఎక్కువే అని చెప్పవచ్చు . సయాటికా అంటే ఒక నొప్పి లేదా జబ్బుగా మాత్రమే అందరికి తెలుసు. కానీ సయాటికా అనేది మన శరీరములో ఉండే నరం అని చాలా తక్కువ మందికి తెలుసు.

మన శరీరంలోని అన్ని నరాల్లోనూ పొడవైన నరం సయాటిక నరం. ఇది నడుములోని వెన్నుపాము నుంచి ప్రారంభమై పిరుదుల నుంచి పిక్కలకూ, అక్కడనుంచి దిగువకూ ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. కాలులో ఉండే అనేక కండరాలను, ఇతర నిర్మాణాలను ఇది నియంత్రిస్తుంది. తొడలు, పిక్కలు, పాదాల్లో స్పర్శను గ్రహించడానికి తోడ్పడుతుంది.

నొప్పి పిరుదుల భాగం నుండి కాళ్లలో పిక్కల వరకు ప్రాకుతుంది. నొప్పి సూదులతో పొడుస్తున్నట్టు మరియు మండినట్లుగాను ఉంటుంది.సయాటిక నరం ప్రయాణించే మార్గం మొత్తం నొప్పిగా అనిపించవచ్చు. సయాటిక నరం ఒత్తుకుపోవడం వల్ల కాలులో తిమ్మిరిగా అనిపిస్తుంది.కొంతమందికి నడవటానికి ఇబ్బంది పడితే,మరికొంత మంది కూర్చోవటానికి,కూర్చుని లేవటానికి చాలా ఇబ్బందిని మరియు నొప్పి కలుగుతుంది.

ఈ సమస్య ఉన్నప్పుడు డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే తొందరగా ఉపశమనం కలుగుతుంది. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక 2 వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి.

ఈ పాలను రాత్రి పడుకొనే ముందు తాగాలి. ఈ వెల్లుల్లి పాలు తాగటం వలన సయాటికా నొప్పి నుండి ఉపశమనం కలగటమే కాకుండా శరీరంలో వాత దోషాలు కూడా తొలగిపోతాయి. రాత్రి సమయంలో ఒక స్పూన్ మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున తినాలి. ఈ విధంగా ఉదయం మెంతులు,రాత్రి సమయంలో వెల్లుల్లి పాలను తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.