Devotional

Tirumala donations:తిరుమలలో లక్ష నుంచి కోటి రూపాయిల డొనేషన్ ఇచ్చేవారికి కల్పించే దర్శన సదుపాయాలు

Tirumala donations one lakh to 1 crore:తిరుమలలో లక్ష నుంచి కోటి రూపాయిల డొనేషన్ ఇచ్చేవారికి కల్పించే దర్శన సదుపాయాలు గురించి తెలుసుకోండి. ఈ ఆర్టికల్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.

లక్ష నుంచి 5 లక్షల రూపాయల డొనేషన్
లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం తిరుమలలో ఒ కరోజు ఐదు మందికి సుఫదం దర్శనం కల్పిస్తారు. అలాగే ఒకరోజు ₹100 రూమ్ కేటాయిస్తారు. ఆరు చిన్న లడ్డూలు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు.

ఐదు నుంచి పది లక్షల రూపాయల డొనేషన్
తిరుమలలో ఐదు నుంచి పది లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు ఐదుగురికి సుఫదం దర్శనం, మూడు రోజులు 100 రూపాయల రూము, పది చిన్న లడ్డూలు, ఒక మహా ప్రసాదం, ఒక దుప్పట్ట, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు.

పది నుంచి 25 లక్షల రూపాయల డొనేషన్
తిరుమలలో 10 నుంచి 25 లక్షలు డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు ఐదుగురికి బ్రేక్ దర్శనం, మూడు రోజులు 500 రూపాయల రూమ్, 20 చిన్న లడ్డూలు, 10 మహా ప్రసాదాలు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్, 50 గ్రాముల ఒక సిల్వర్ కాయిన్ ఇస్తారు.

25 నుంచి 50 లక్షల రూపాయల డొనేషన్
తిరుమలలో 25 నుంచి 50 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒకరోజు సుఫదం దర్శనం, మూడు రోజులు ఐదు మందికి బ్రేక్ దర్శనం, మూడు రోజులు 1500 రూపాయల రూము, 4 పెద్ద లడ్డూలు, ఐదు చిన్న లడ్డూలు, 10 మహా ప్రసాదాలు, ఒక దుప్పట్ట, ఒక బ్లౌజ్ పీస్, ఐదు గ్రాముల ఒక గోల్డ్ డాలర్, 50 గ్రాముల ఒక సిల్వర్ కాయిన్ ఇస్తారు.

50 నుంచి 75 లక్షల రూపాయలు డొనేషన్
తిరుమలలో 50 నుంచి 75 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక ఒకరోజు సుప్రభాత సేవ, రెండు రోజులు సుపధం దర్శనం, మూడు రోజులు ఐదు మందికి బ్రేక దర్శనం, మూడు రోజులు 2000 రూపాయల రూమ్ ఇస్తారు. అలాగే ఆరు పెద్ద లడ్డూలు, పది చిన్న లడ్డూలు, 10 మహా ప్రసాదాలు, ఒక దుప్పట్ట, ఒక బ్లౌజ్ పీస్, 5 గ్రాముల ఒక గోల్డ్ డాలర్, 50 గ్రాముల ఒక సిల్వర్ కాయిన్ ఇస్తారు.

75 నుంచి కోటి రూపాయల డొనేషన్
తిరుమలలో 75 లక్షలు నుంచి కోటి రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం రెండు రోజులు సుప్రభాత సేవ, మూడు రోజులు సుపథం దర్శనం, మూడు రోజులు ఐదు మందికి బ్రేక్ దర్శనం, మూడు రోజులు 2500 రూపాయల రూమ్ ఇవ్వటమే కాకుండా పది మహా ప్రసాదాలు, ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్, 5 గ్రాముల ఒక గోల్డ్ డాలర్, 50 గ్రాముల ఒక సిల్వర్ కాయిన్ ఇస్తారు.

కోటి రూపాయల పైన డొనేషన్
తిరుమలలో కోటి రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజుల సుప్రభాత సేవ, నాలుగు రోజుల సుఫదం దర్శనం, మూడు రోజులు ఐదుగురికి బ్రేక దర్శనం, మూడు రోజులు మూడువేల రూపాయల రూమ్ ఇస్తారు. అలాగే పది పెద్ద లడ్డు లు, 20 చిన్న లడ్డులు, 10 మహా ప్రసాదాలు, ఒక దుప్పట్ట, ఒక బ్లౌజ్ పీస్, 5 గ్రాముల గోల్డ్ డాలర్ ,50 గ్రాముల సిల్వర్ కాయిన్ మరియు వేద ఆశీర్వచనం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.