Beauty Tips

White Hair Turn Black:చిన్న వయసులో తెల్లజుట్టు.. నల్లగా మారాలంటే ఇలా చేయాల్సిందే..!

White Hair Turn Black: మారిన జీవనశైలి పరిస్థితి, ఒత్తిడి, రసాయనాలు ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను వాడటం, జుట్టుకి సరైన పోషణ లేకపోవటం, జుట్టుకి అవసరమైన సంరక్షణ లేకపోవటం వంటి అనేక కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

ముఖ్యంగా చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వస్తుంది. చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావటంతో కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచిది.

కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. గుడ్డులోని తెల్లసొన లేదా మజ్జిగతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్ట్‌ని తలకు ప్యాక్‌గా వేసుకోవాలి. రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్‌ చేసుకోవాలి.

తలస్నానానికి తక్కువ గాఢత ఉన్న షాంపూలనే ఉపయోగించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు రాదు. వచ్చిన తెల్ల జుట్టు కాలక్రమేణా నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు సమస్యకు మంచి చిట్కా అని చెప్పవచ్చు.

ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇలా చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.