Healthhealth tips in telugu

Gaju teega :మన చుట్టుపక్కల ఉండే ఈ మొక్క లో ఉండే ఔషధ గుణాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Gaju teega Health benefits in telugu :మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి కానీ వాటి గురించి తెలియక మనం పిచ్చి మొక్కలు అని భావిస్తాం. కానీ వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అలాగే వాటిని ఆయుర్వేద మందులలో వాడుతూ ఉంటారు. ఆయుర్వేదం మీద నమ్మకం ఉన్న వారికి ఇటువంటి మొక్కల మీద కూడా శ్రద్ధ నమ్మకం కలుగుతాయి.

ఈ మొక్క పేరు గాజు తీగ దీనిని బంగారు తీగ లేదా బుట్ట బుడస,తెల్ల జుంకి అని ప్రాంతాన్నిబట్టి పిలుస్తారు.ఇది వేరే లాగా ఉంటుంది దీనికి కాయలు కాస్తాయి. తీగ వలె పెరిగే ఈ మొక్కలో ఆకులు మరియు వేర్లలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఈ చెట్టు ఆకుల కషాయాన్ని తాగితే నిద్రలేమి సమస్య తొలగిపోతుంది

తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ ఆకును మెత్తని పేస్ట్లా తయారు చేసి నుదుటిపై రాస్తే వెంటనే తల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే చర్మ వ్యాధులు తగ్గటానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ ఆకులతో తయారుచేసిన కషాయాన్ని తాగితే దగ్గు,జలుబు,ఊపిరితిత్తులలో నిమ్ము వంటి సమస్యలు తొలగిపోతాయి.

గాజు తీగ మొక్క ఆకులు, వేర్లను ఆయుర్వేద మందులలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఆయుర్వేద మందుల్లో ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది అయితే ఇటువంటి మొక్కలను వాడే ముందు ఆయుర్వేద వైద్య నిపుణున్ని ఒక్కసారి సంప్రదిస్తే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.