Lakshmi Devi:ఇంట్లో మహాలక్ష్మి తాండవించాలంటే ఇలా చేయాలట
Lakshmi Devi : ధనం మూలం ఇదం జగత్ … అన్నారు పెద్దలు .. పైసామే పరమాత్మా హై అనేమాట కూడా వింటూంటాం. మొత్తానికి ఏది చేయాలన్న డబ్బుతో ముడిపడి ఉంది లోకం. గతంలో అయితే వస్తుమార్పిడి విధానం ఉండేది. ఆగిపోవడంతో ఇప్పుడు డబ్బే ప్రధానం అయింది. డబ్బుంటేనే విలువ ఇస్తున్నారు.
అయితే డబ్బుకి ప్రతిరూపం లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే, మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే కొన్ని ఆచరించి చూపించాలట. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులు ఐశ్వర్యాన్ని పెంచుతాయని అంటారు.
ఓంకారం ఇంట్లో ఉంటె నెగెటివ్ సెన్స్ లు పోయి ఇంట్లో అన్నీ శుభాలు కలుగుతాయని అంటారు. పూర్ణకుంభం కూడా మంచిదని అందుకే వివాహ సమయంలో ఎక్కువ వాడతారని చెబుతారు.
విండ్ చిమ్స్ అనే గాలి గంటలు ఇంట్లో ఉంటె గాలికి రకరకాల శబ్దాలు వస్తాయని, ఇది లక్ష్మీదేవికి ప్రీతికరమని చెబుతూ ఉంటారు. ఒక ప్లేట్ లో నీళ్లు పోసి తాబేలు ఉంచితే ఇంట్లో డబ్బుకి కొదవ ఉండదని కూడా అంటారు.
ఇంట్లో చేప పిల్లలను పెంచడం కూడా మహాలక్ష్మీదేవిని ఆహ్వానించినట్లని చెబుతారు. అందునా గోల్డ్ ఫిష్ రకం అయితే ఇంకా మంచిదట.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.