బొద్దింకలు బీభత్సం సృష్టిస్తున్నాయా ?.. ఈ ఇంటి చిట్కాలతో అన్నీ మాయం..
Home Remedies For Cockroach Control In Telugu :సాధారణంగా ఏదో ఒక సమయంలో ప్రతి ఇంటిలోనూ బొద్దింకలు కనబడుతూ ఉంటాయి ఎక్కువగా వంటగది కబోర్డ్స్ లో ఉంటాయి ఇవి బ్యాక్టీరియాకు వాహకాలుగా ఉంటాయి మనం పడేసే ఆహారాన్ని తింటూ బతుకుతాయి ఇవి చాలా తక్కువ సమయంలోనే సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి మనకు చాలా అసౌకర్యానికి గురి చేస్తాయి.ఇంటి చిట్కాల ద్వారా బొద్దింకలను తరిమికొట్టొచ్చు
బేకింగ్ సోడా లో పంచదార కలిపి బొద్దింకలు ఉండే ప్రదేశంలో చల్లాలి. బొద్దింకలకు చక్కెర అంటే చాలా ఇష్టం కానీ దానిలో కలిపిన బేకింగ్ సోడా ను బొద్దింకలు జీర్ణం చేసుకోలేక చనిపోతాయి
బొద్దింకలు కాఫీ వాసనకు చాలా సులభంగా ఆకర్షితం అవుతాయి. అయితే కాఫీ రుచి చూసిన తర్వాత కాఫీలో ఉండే కెఫిన్ చంపుతుంది అందువల్ల. బొద్దింకలు ఉన్న ప్రదేశంలో కాఫీ పొడి జల్లితే బొద్దింకలు పోతాయి
పుదీనా కూడా బొద్దింకలను తరిమికొట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది పుదీనా ఆకులను బొద్దింకలు ఉన్న ప్రదేశంలో పెట్టవచ్చు.
బొద్దింకలు ఉల్లి వెల్లుల్లి వాసనను అస్సలు భరించలేవు. అందువల్ల ఉల్లిపాయ, వెల్లుల్లి కొన్ని మిరియాలు నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని బొద్దింకలు ఉన్న ప్రదేశంలో spry చేస్తే పారిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.