Kitchenvantalu

Green Moong Cutlet Recipe:పెసరపప్పుతో ఇలా హెల్తీ గా స్నాక్స్ చేసుకోండి

Green Moong Cutlet Recipe:ఈ రుచికరమైన కట్లెట్ ఆకుపచ్చని పెసర పప్పు,అటుకులతో తయారుచేసినది. ప్రోటీన్ సమృద్దిగా ఉన్న ఈ కట్లెట్ ని చిన్న పిల్ల నుండి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు. డైటింగ్ చేస్తున్నప్పుడు కూడా తినవచ్చు.

కావలసిన పదార్ధాలు
1 కప్పు నానబెట్టిన ఆకుపచ్చని పెసరపప్పు
1 కప్పు నానబెట్టిన అటుకులు
1 ఉల్లిపాయ (ముక్కలుగా కట్ చేయాలి)
4 పచ్చిమిర్చి (సన్నగా తరిగిన)
1-అంగుళాల అల్లం (సన్నగా తరిగిన)
1/2 కప్పు కొత్తిమీర ఆకులు
2 టేబుల్ స్పూన్లు శనగపిండి
1 tsp జీరా (జీలకర్ర) పొడి
1 tsp ధనియా పొడి
1 టీస్పూన్ ఎర్ర కారం
రుచికి ఉప్పు
పాన్
వేయించడానికి నూనె

తయారుచేసే విధానం
ఆకుపచ్చని పెసరపప్పును శుభ్రంగా కడిగి నీటిని పోసి 5 గంటల పాటు నానబెట్టాలి. నానిన పప్పును ముతకగా రుబ్బుకోవాలి. అటుకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. శనగపిండిని గోధుమరంగులోకి మారి సువాసన వచ్చే వరకు తక్కువ మంటపై వేగించాలి.

ఒక పెద్ద గిన్నెలో రుబ్బిన పెసరపప్పు,శనగపిండి , అటుకులు,ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం మరియు కొత్తిమీర కలపండి.ఆ తరువాత, పైన పేర్కొన్న మసాలా పొడులను వేసి అన్ని పదార్థాలను బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని టిక్కీల మాదిరిగా చేసి మీడియం మంటపై రెండు వైపులా ఫ్రై చేయండి. కట్లెట్స్‌ని గ్రీన్ చట్నీ లేదా కెచప్‌తో వేడిగా సర్వ్ చేయండి.