Masala Banana Chips:ఇలా బనానా చిప్స్ చేస్తే క్రిప్సి గా పర్ఫెక్ట్ గా వస్తాయి.. తక్కువ నూనెతో..
Masala Banana Chips: మనందరికీ పచ్చి అరటికాయతో చేసిన చిప్స్ అంటే చాలా ఇష్టం. వీటిని ఇప్పుడు చెప్పే విధంగా తయారుచేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకు స్నాక్ గా పెట్టవచ్చు.
కావలసిన పదార్ధాలు
2 పచ్చి అరటి కాయలు (తొక్క తీయాలి)
1/4 స్పూన్ ఎర్ర కారం
1/4 స్పూన్ మిరియాల పొడి
1/4 టీస్పూన్ చాట్ మసాలా
ఉప్పు రుచికి సరిపడా
2 స్పూన్ నూనె
జీలకర్ర పొడి చిటికెడు
పసుపు
తయారి విధానం
ముందుగా అరటికాయలను తొక్క తీసి చిప్స్ మాదిరిగా కోయాలి. ఈ ముక్కలపై కొంచెం నూనె,పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్‌లో ఒక పొరలో వీటిని వేసి కొంచెం నూనెను చిలకరించి, 160 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎయిర్ ఫ్రై చేయండి.
చిప్స్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు, వాటిపై ఎర్ర కారం, చాట్ మసాలా మరియు మిరియాల పొడి చల్లి బాగా కలిపి సర్వ్ చేయటమే.