Healthhealth tips in telugu

kismis Benefits:ఈ గింజలు తింటే శరీరంలో రక్తాన్ని బాగా పెంచి 100 ఏళ్ళు వచ్చిన రక్తహీనత,అలసట రావు

kismis Health benefits in telugu : ఐరన్ లోపం ఉంటే రక్తహీనత సమస్య వస్తుంది. ఈ లోపం నుండి బయట పడాలంటే కిస్ మిస్ సహాయపడుతుంది. కిస్ మిస్ ఎలా సహాయ పడుతుందో తెలుసుకొనే ముందు ఐరన్ లోపం గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రక్తహీనత సమస్య గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం.

ఈ రక్తహీనత సమస్య అనేది ముఖ్యంగా చిన్న పిల్లలు,మహిళలు,వయస్సు బాగా పెరిగిన వారిలో కనిపిస్తుంది. అసలు ఐరన్ లోపం అని ఎప్పుడు అంటారో చూద్దాం. మ‌న శ‌రీరంలోని అన్ని భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కావ‌డానికి హీమోగ్లోబిన్ తోడ్ప‌డుతుంది. ఆ హీమోగ్లోబిన్ ఉత్ప‌త్తికి ఐర‌న్ అవ‌స‌రం. ఐర‌న్ లోపిస్తే ర‌క్త‌హీన‌త‌కు దారితీస్తుంది.

దానినే అనీమియా అని పిలుస్తారు. ఈ సమస్య ఉన్నప్పుడు బయటకు పెద్దగా లక్షణాలు కనపడకపోయిన మెల్లగా రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్య ఉన్నప్పుడు చాలా జాగ్రత్తాగా ఉండాలి. మనం తీసుకొనే ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఐరన్ లోపాన్ని అధికమించవచ్చు.

కిస్ మిస్ పండ్ల‌లో ఐర‌న్ ఎక్కువగా ఉంటుంది. ఇది ర‌క్త‌హీన‌త‌ను నివారిస్తుంది. ప్రతి రోజు 5 కిస్ మిస్ పండ్ల‌ను తింటుంటే ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. కిస్ మిస్ లోని ధాతువులు రక్తంలోని రక్తకణాలను పెంచుతుంది.కిస్ మిస్ లో ఇనుము మరియు విటమిన్ బి-కాంప్లెక్స్ పుష్కలంగా ఉన్నాయి.

మీ రోజువారీ ఆహారంలో 5 కిస్ మిస్ లను చేర్చడం ద్వారా ఇనుము లోపం మరియు రక్తహీనతకు చికిత్స చేయవచ్చు. కొత్త ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన కాపర్ ని కూడా అందిస్తుంది. కాబట్టి కిస్ మిస్ తిని రక్తహీనత సమస్య నుండి బయటపడండి. సమస్య చిన్నగా ఉంటే ఇలా ఇంటి చిట్కాలు సరిపోతాయి. అదే సమస్య పెద్దగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.