Vankaya:డయబెటిస్ ఉన్న వారు వంకాయ తింటే ఏమి అవుతుంది…
Vankaya Health Benefits in Telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా చిన్న వయసులోనే షుగర్ బారిన పడుతున్నారు. షుగర్ అంటే డయాబెటిస్. డయాబెటిస్ వచ్చింది అంటే జీవిత కాలం మందులు వాడాల్సిందే. మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలు తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది. డయబెటిస్ ఉన్నవారిలో ఆహారం కీలక పాత్రను పోషిస్తుంది.
డయాబెటిస్ అనేది అధిక బరువు, సరైన జీవనశైలి లేకపోవడం, వ్యాయామం సరిగ్గా చేయకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో వస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి వంకాయ చాలా మంచిది. వంకాయలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర నిదానంగా కలుస్తుంది. దాంతో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
వంకాయలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటం వలన డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకే వంకాయలను తిన్న వెంటనే రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు. వంకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కారణంగా వచ్చే నష్టంను నివారిస్తుంది.
ఈ క్రమంలోనే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయి కనుక వంకాయలను తినడం వల్ల ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి డయబెటిస్ ఉన్నవారు వారంలో 2 సార్లు వంకాయ తింటే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.