Beauty Tips

Remove Warts:ఇలా చేస్తే 1 రోజులో పులిపిర్లు శాశ్వతంగా రాలిపోతాయి…డాక్టర్ అవసరమే ఉండదు

How to Remove Warts in Telugu : పులిపిర్లు అనేవి వయస్సుతో సంబందం లేకుండా వస్తాయి. పులిపిర్లు వాటి ఆకారంలో విభిన్నంగా ఉంటాయి,అంటే అనేక రకాల ఆకారాల్లో శరీరంపై ఏర్పడి,చూడటానికి అందవిహీనంగా కనపడతాయి. పులిపిర్లు రాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే కొన్ని క్రీమ్ లు వాడుతూ ఉంటారు. అలా వాడకుండా ఇంటి చిట్కాలను ట్రై చేయవచ్చు.

పసుపు,సున్నం,(తాంబూలంలో వేసుకొనే సున్నం) వంటసోడా మూడింటిని సమాన బాగాలుగా తీసుకొని నీటిని పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని టూత్ పిక్ సాయంతో పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి పావుగంట అయ్యాక శుభ్రం చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా పులిపిర్లు రాలిపోతాయి.
weight loss tips in telugu
అలాగే రాత్రి సమయంలో ఒక స్పూన్ అవునెయ్యిలో చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలిపి తీసుకోవాలి. రాత్రి సమయంలో రాగి పాత్రలో నీటిని పోసి 6 తులసి ఆకులను వేసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ తులసి ఆకులను నములుతూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.
Tulasi Health benefits in telugu
రోగనిరోదక శక్తి తగ్గినప్పుడు పులిపిర్లు వస్తాయి. ఇప్పుడు చెప్పిన మూడు చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే పులిపిర్లు రాలిపోతాయి. దీని కోసం ఖరీదైన మందులు వాడవలసిన అవసరం లేదు. ఇలా చేసిన తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి. ఏ ఆరోగ్య సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.