White Hair Turn Black:డికాషన్ లో కలపి రాసుకోండి చాలు.. తెల్లజుట్టు నల్లగా మారిపోవడం ఖాయం..!
White Hair Turn Black : చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావటంతో బయటకు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతో చాలా కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను వాడేస్తున్నారు.
తెల్ల జుట్టును నల్లగా మార్చే హోమ్ రెమిడి తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు కంగారు పడకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
ఈ చిట్కా కోసం మనం ఉపయోగించే అన్ని పదార్థాలు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే.ముందుగా టీ డికాషన్ తయారు చేసుకోవాలి. గిన్నె పెట్టి ఒక్క అర కప్పు నీటిని పోసి ఒక స్పూన్ టీ పొడి వేసి మరిగించి డికాషన్ వడకట్టాలి. ఒక ఐరన్ పాన్ తీసుకుని దానిలో రెండు స్పూన్ల ఉసిరి పొడి వేసుకోవాలి.
ఆ తర్వాత రెండు స్పూన్ల బృంగరాజ్ పౌడర్ వెయ్యాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల ఇండిగో పౌడర్ వేయాలి. రెండు నిమిషాల పాటు వేగించి కొంచెం వాటర్ వేసి ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని ఒక గంట పక్కన పెట్టేస్తే నల్లని రంగులోకి మారుతుంది.
దీనిలో రెండు స్పూన్ల టీ డికాషన్ వేసి బాగా కలిపి తలకు పట్టించాలి. గంటయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాలు, తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం పడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.