White Teeth:ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయినా 5 నిమిషాల్లో తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి
Home remedies for white teeth and bad breath : పళ్ళు తెల్లగా అందంగా మెరుస్తూ ఉంటేనే బాగుంటుంది. చాలా.మంది పళ్ళు గార పట్టి పసుపు రంగులో మారి ఉంటాయి. అంతేకాకుండా మరి కొంత మందికి చిగుళ్ల వాపు వస్తుంది. అలాగే నోటి దుర్వాసన కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. .
ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్ధంగా ఉండే వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక అంగుళం అల్లం ముక్కని తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి తురమాలి.
ఒక నిమ్మకాయ తీసుకొని సగానికి కట్ చేసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. పొయ్యి వేలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు నీటిని పోసి నీరు కాస్త వేడెక్కాక అల్లం తురుము, నిమ్మకాయ ముక్కలు వేసి 10 నుంచి 12 నిమిషాల పాటు బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
ఒక బౌల్లో ఒక స్పూను లవంగాల పొడి, ఒక స్పూన్ యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్, ఒక స్పూన్ వైట్ టూత్ పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ముందుగా తయారుచేసి పెట్టుకున్న నీటిని కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో దంతాలకు అప్లై చేసి సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పళ్ళను శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే క్రమంగా పళ్ళు తెల్లగా మెరుస్తాయి.
గార పట్టిన,పసుపు రంగులోకి మారిన పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త సమయాన్ని శ్రద్ద పెడితే సరిపోతుంది. ఇంటి చిట్కాలను పాటించి తెల్లని ముత్యాల్లాంటి పళ్లను సొంతం చేసుకొండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.