Kitchenvantalu

Karela Tikki Recipe: ఇవి సాయంత్రం స్నాక్ గా సూపర్ గా ఉంటాయి.. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి..

Karela Tikki Recipe: కాకరకాయతో ఈ విధంగా టిక్కి చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. దీనిలో పనీర్ కూడా వేయటం వలన బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు
2 పెద్ద కాకరకాయలు
1/2 కప్పు పనీర్
తురిమిన1 ఉల్లిపాయ
2 పచ్చిమిర్చి
1-అంగుళం అల్లం
4 వెల్లుల్లి
1/2 కప్పు కొత్తిమీర ఆకులు
1 కప్పు శనగపిండి
1 టీస్పూన్ ఆమ్చూర్ పొడి/ చాట్ మసాలా
1 స్పూన్ ఎర్ర కారం
1/2 టీస్పూన్ పసుపు
1/2 స్పూన్ వాము
ఉప్పు రుచికి సరిపడా
వేయించడానికి నూనె

తయారి విధానం
కాకరకాయను శుభ్రంగా కడిగి తురమాలి. ఈ తురుమును మిక్సీ లో వేసి బరకగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమానికి ఒక స్పూన్ ఉప్పు కలిపి అరగంట పక్కన పెట్టాలి.
ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర తరుగు సన్నగా తరిగి పెట్టుకోవాలి.

పెద్ద గిన్నెలో కాకరకాయ మిశ్రమాన్ని గట్టిగా పిండి వేయాలి. ఆ తర్వాత దానిలో ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు,కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పనీర్,శనగపిండి,వాము,చాట్ మసాలా,కారం,పసుపు,రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి టిక్కీల మాదిరిగా వత్తాలి. వీటిని బంగారు గోధుమ రంగు వచ్చేవరకు మీడియం మంట మీద వేయించాలి. గ్రీన్ చట్నీతో కరేలా టిక్కీలను వేడిగా సర్వ్ చేయండి.