face glow tips:పార్టీకి వెళ్లే 10 నిమిషాల ముందు ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది
Multani Mitti and tomato Face Pack In Telugu : మనం పార్టీలకు వెళ్ళటానికి ముందు మేకప్ విషయంలో చాలా గాబరా పడుతూ ఉంటాం. బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్స్ వంటివి చేయించుకుంటూ ఉంటాం. అలాంటివి ఏమి చేయకుండా తక్కువ ఖర్చుతో ఇప్పుడు చెప్పే పేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.
ఈ రోజుల్లో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖం మీద జిడ్డు, నలుపు,టాన్ ని తొలగించుకుంటే ముఖం తెల్లగా మెరిసిపోతుంది. ఈ చిట్కా కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. ఇవి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉందేవే.
టమోటాను సగానికి కట్ చేసి రసాన్ని తీసుకోవాలి. టమోటాలో ఉండే లైకోపిన్,యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి ముఖంపై ఉండే నలుపు, మృత కణాలు,టాన్ ని సమర్ధవంతంగా తొలగిస్తుంది. ఆ తర్వాత పెరుగు తీసుకోవాలి. పెరుగులో లాక్టిక్ ఆమ్లాలు,ప్రోటీన్స్ సమృద్దిగా ఉంటాయి. ఈ ప్యాక్ లో పెరుగు వేయటం వలన చర్మం మీద మృత కణాలు తొలగిపోయి మృదువుగా కాంతివంతంగా మారుతుంది.
ఆ తర్వాత Multani Mitti తీసుకోవాలి. Multani Mitti ఆయుర్వేద షాప్ లోనూ బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మే షాప్ లో దొరుకుతుంది. Multani Mitti ముఖంపై ఉన్న నలుపును, అధికంగా ఉన్న జిడ్డును తొలగించటంలో సహాయపడుతుంది. Multani Mitti చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది.
ఒక బౌల్ లో రెండు స్పూన్ల టమోటా రసం,ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ Multani Mitti వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖాన్ని పట్టించి రెండు నిముషాలు మసాజ్ చేసి అరగంట అయ్యాక సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.