Kalki 2898 AD Ticket: బెన్‌ఫిట్ షో టికెట్ రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం
Kalki 2898 AD Ticket: బెన్‌ఫిట్ షో టికెట్ రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం.. డార్లింగ్ ప్రభాస్ ‘కల్కి’ సినిమా ఈ నెల 27 న అభిమానుల ముందుకు వస్తుంది. నాగ అశ్విన్ దర్సకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
జూన్ 27 ఉదయం 5:30 గంటలకు బెన్‌ఫిట్ షో వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అలాగే సినిమా విడుదల అయినా రోజు నుంచి ఐదురోజుల పాటు రోజుకి ఐదు షోలు వేసుకునేలా ఉత్వర్తులు జారీ చేశారు. అలానే ఒక్కో టికెట్‌పై గరిష్టంగా రూ.200 పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చారు.
సాధారణ థియేటర్లలో అయితే రూ.70, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనిబట్టి చూస్తే బెన్‌ఫిట్ షో కోసం సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ.377, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.495 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
మిగతా రోజుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.265, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.413 రూపాయలు ఉండే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో బుకింగ్, త్రీడీ గ్లాస్ ఛార్జీలు అదనం. దీనిబట్టి చూస్తే ఒక్కో టికెట్ ధర రూ.500కి మించే ఉంటుంది!