Beauty Tips

Hair fall Control:షాంపూలో వీటిని కలిపి తలస్నానం చేస్తే చుండ్రు,జుట్టు రాలటం అనేది అసలు ఉండదు

Hair Fall Home Remedies In telugu : ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్యతో బాధపడుతున్నారు. జుట్టుకి అవసరమైన పోషకాలు అందకపోవటం, వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనబడుతుంది.
hair fall tips in telugu
ఈ సమస్య రాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు, షాంపులను వాడుతూ ఉంటారు. అలా. కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి రెండు స్పూన్ల టీ పొడి వేసి రెండు నిమిషాలు మరిగించాలి.
Hibiscus leaf
ఆ తర్వాత నాలుగు మందార ఆకులను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఐదు నిమిషాలు వరకు బాగా మరిగించి చల్లారాక వడగట్టాలి. ఈ నీటిలో మనం రెగ్యులర్ గా వాడే షాంపూ ని కలిపి తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య,చుండ్రు,దురద వంటి అన్నీ రకాల సమస్యలు తగ్గుతాయి.
black tea
మందార ఆకులలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. విటమిన్ సి ఉండుట వలన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మందార ఆకులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గించటానికి సహాయపడతాయి. తెల్లజుట్టును నల్లగా మార్చటానికి కూడా సహాయపడుతుంది.
Hair Care
టీ పొడిలో ఉన్న పోషకాలు చుండ్రు సమస్యను,తెల్ల జుట్టు సమస్యను, జుట్టు రాలే సమస్యను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. టీ పొడి, మందార ఆకులు ప్రతి ఇంటిలోనూ సులువుగానే లభ్యం అవుతాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.