Bellam Tea:టీ లో పంచదారకు బదులుగా బెల్లం వాడితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
Bellam Tea:ప్రతి రోజు ఉదయం లేవగానే టీ తాగకపోతే ఏమీ తోచదు ఏ పని చేయాలనిపించదు. కొంతమంది రోజుల్లో ఐదు కప్పుల టీ తాగుతూ ఉంటాయి. టీ తాగినప్పుడు ఎలా దానిలో ఉండే పంచదార మన శరీరంలోకి వెళ్లి అధికంగా క్యాలరీలు చేరేలా చేస్తుంది. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అల పంచదార కు బదులు బెల్లం వాడితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.
బెల్లం లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని తరిమికొడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు జలుబు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య లేకుండా ఉండటమే కాకుండా శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా బాగా జరుగుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి బెల్లం చాలా బాగా హెల్ప్ చేస్తుంది.జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పెడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.