Astrology: జులై నెలలో పుట్టినవారి లక్షణాలు…తెలివితేటలు ఎక్కువ…?
July Month born: మనలో చాలా మంది జ్యోతిషశాస్త్రంను నమ్ముతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం పుట్టిన నెల ప్రకారం వారి లక్షణాలు, వారి జీవితం ఎలా ఉంటుందో అనే విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి వ్యక్తిలోనూ అనేక బలాలు ,అనేక లోపాలు ఉండటం అనేది సహజమే.
ఈ నెలలో పుట్టినవారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయకుండా ముందుకే సాగుతారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్న పనులను చేస్తారు. వీరికి కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఎక్కువగానే ఉంటుంది. కోపాన్ని అసలు కంట్రోల్ చేసుకోలేరు.
July నెలలో పుట్టిన వారు నేర్చుకోవాలనే తపనతో పాటు కష్టపడి పనిచేస్తారు. చాలా సృజనాత్మకంగా ఉండి కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. July లో జన్మించిన వ్యక్తులు పదునైన తెలివితేటలు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ వారితో స్నేహం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.
వీరు ఏ రంగంలో ఉన్నా సరే ఉన్నతంగా రాణిస్తారు. అయితే ఈ నెలలో పుట్టిన వ్యక్తులు గాయకులు, రచయితలు, సంపాదకులు, శాస్త్రవేత్తలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో పుట్టినవారు ఎక్కువ ప్రేమను పంచుతారు. ఈ వ్యక్తుల వైవాహిక జీవితం చాలా చక్కగా సాగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.