Corn Silk:పొరపాటున కూడా మొక్కజొన్న పీచు పాడేయద్దు…ఈ రహస్యం తెలిస్తే అసలు వదలరు…
Corn Silk Health benefits in telugu :మొక్కజొన్న చాలా చవకైన మంచి పోషకాలు ఉన్న బలమైన ఆహారం. మొక్కజొన్న గింజలను కాల్చుకొని లేదా ఉడికించుకొని తింటూ ఉంటారు. మొక్కజొన్న గింజల నుండి పాప్ కార్న్,కార్న్ ఫ్లెక్స్ వంటి వాటిని తయారుచేస్తారు. లేతగా ఉన్న మొక్కజొన్న కంకులను మరియు బేబీ కార్న్ లను కూరగా చేసుకుంటారు. బేబీ కార్న్ తో అనేక రకాల మసాలా వంటకాలను చేసుకుంటారు.
మొక్కజొన్న గింజలను పిండిగా చేసి రొట్టెలుగా చేసుకుంటారు. మొక్కజొన్న గింజల నుండి నూనెను తీస్తారు. మొక్కజొన్నలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి మొక్కజొన్న పీచులో కూడా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. సాధారణంగా మనం మొక్కజొన్న పొత్తులు తేగానే తొక్కలు,పీచు తీసేసి పాడేస్తూ ఉంటాం.
పీచు కూడా మనకు ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు. మొక్కజొన్నలో కొవ్వు పదార్ధాలు,మాంసకృతులు,విటమిన్ ఏ, దయామిన్, విటమిన్ బి, నియాసిన్,విటమిన్ బి3,పోలేట్ ,విటమిన్ సి,ఐరన్, పొటాషియం వంటివి ఉంటాయి. అయితే ఇప్పుడు మొక్కజొన్న పీచులో ఏమి ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.
మొక్కజొన్న పీచు అనేది కిడ్నీ సమస్యలను తగ్గించటానికి బాగా సహాయపడుతుంది. మొక్కజొన్న పీచుతో టీ తయారుచేసుకొని త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మొక్కజొన్న పీచును సాంప్రదాయ వైద్యంలో మన దేశంలో కంటే విదేశాలలో ఎక్కువగా వాడుతున్నారు. అమెరికా,చైనా,జపాన్ వంటి దేశాలలో మొక్కజొన్న పీచును ఎక్కువగా వాడుతున్నారు.
మొక్కజొన్న పీచుతో టీ తయారుచేసుకొని త్రాగితే సహజసిద్ధమైన ప్లేవనాయిడ్స్,యాంటీఆక్సిడెంట్స్ ,విటమిన్ సి అనేవి మన శరీరానికి బాగా అందుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే శరీరంలో కీలకమైన అవయవాల పనితీరు బాగుండేలా చేస్తుంది. మొక్కజొన్న పీచులో పొటాషియం, కాల్షియం మరియు విటమిన్లు బి 2, సి మరియు కె వంటి కీలకమైన పోషకాలు ఉన్నాయి.
మొక్కజొన్న పీచులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. మూత్ర నాళంలో బ్యాక్టీరియా ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో ఉన్న అదనపు నీరు మరియు వ్యర్థాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక రక్తపోటు మరియు మూత్ర పిండాల వ్యాధులతో సహా అనేక ఆరోగ్య ప్రమాదాల నుండి బయటపడటానికి సహాయపడుతుంది.
మూత్రపిండాల్లో రాళ్ళు రాకుండా ఉండటానికి మొక్కజొన్న పీచును పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. మొక్కజొన్న పీచు వాడటం వలన మూత్ర ప్రవాహాన్ని పెంచుతుంది మరియు మూత్రపిండాలలో రాళ్ళూ ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది. అయితే అప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే మాత్రం చికిత్స చేయదని గుర్తుంచుకోవాలి.
రక్తం గడ్డకట్టే ప్రక్రియలో సహాయపడే విటమిన్ కె మొక్కజొన్న పీచులో అధికంగా ఉంటుంది. రక్తపోటు సమస్యతో బాధపడేవారికి మొక్కజొన్న పీచుతో తయారుచేసిన టీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. మొక్కజొన్న పీచు టీ మానవ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
మొక్కజొన్న పీచులో శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన ఆర్థరైటిస్ సమస్యలు రాకుండా చేస్తుంది. కీళ్ళలో అధిక యూరిక్ యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది. మొక్కజొన్న పీచులో విటమిన్ సి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. అధిక బరువుతో ఉన్నవారు రోజుకో రెండు లేదా మూడు సార్లు మొక్కజొన్న పీచుతో తయారుచేసిన టీ త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. అయితే మొక్కజొన్న పీచును ఎలా నిల్వ చేసుకోవాలి.అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మొక్కజొన్న పీచును గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో భద్రపరిస్తే కొన్ని వారాల పాటు నిల్వ ఉంటుంది. భద్రపరిచే ముందు తడి లేకుండా బాగా ఆరబెట్టాలి.
మొక్కజొన్న పీచుతో టీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. ఒక గిన్నెలో నీటిని పోసి దానిలో మొక్కజొన్న పీచు వేసి బాగా మరిగించి
వడకట్టాలి. ఈ మిశ్రమంలో నిమ్మరసం కలిపి త్రాగాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.