Healthhealth tips in telugu

Weight Loss: బరువు,పొట్ట తగ్గి నాజూగ్గా కనిపించాలా? ఈ గింజలను ట్రై చేయండి

Fenugreek Seeds For Weight Loss: ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది అధిక బరువు, బాణ పొట్ట సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో మిగతా బాగాలు సన్నగా ఉన్నా పొట్ట మాత్రం బాగా ఎత్తుగా ఉండి కాస్త అసహ్యంగా కనపడటమే కాకుండా బయటకు వెళ్లాలన్న చాలా ఇబ్బంది పడతారు.

అంతేకాక బాణ పొట్ట కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ డ్రింక్స్ ఉదయం సమయంలో తాగితే మంచిది. మెంతులు బాణ పొట్టను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. మెంతులను వెగించి పొడిగా చేసుకోవాలి.

ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ మెంతుల పొడిని కలిపి తాగాలి. పుదీనా ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని మరిగించి వడకట్టి తేనె,నిమ్మరసం కలిపి తాగాలి. ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఈ డ్రింక్ తాగితే. మెటాబాలిజాన్ని వేగవంతం చేసి.పొట్ట చుట్టు కొవ్వును క‌రిగిస్తుంది.

అయితే ఉదయం సమయంలో మెంతుల నీటిని తాగితే… రాత్రి సమయంలో పుదీనా డ్రింక్ తాగితే పొట్ట తగ్గి నాజుగ్గా కనపడతారు. అధిక బరువు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. కాబట్టి కాస్త శ్రద్దగా ఈ రెండు చిట్కాలను ఫాలో అవ్వండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.