Cold And Cough:జలుబు,దగ్గు,గొంతునొప్పి మరియు వాపును శాశ్వతంగా మాయం చేసే టిప్..
cough Home Remedies In Telugu :ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవలసిన అవసరం ఉంది. అలాగే దగ్గు గొంతులో శ్లేష్మం తగ్గించుకోవడానికి ఈ రోజు ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ సమస్య ఉన్నప్పుడు శ్వాసలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి సమస్యలు ఉండవు
ప్రతీ ఒక్కరికీ రోగనిరోధక శక్తి ఎంత ఇంపార్టెంటో తెలిసిపోయింది. ఆ కారణంగానే మార్కెట్లోకి రోగనిరోధక శక్తిని పెంచే అనేక ఆహారాలు, పానీయాలు లభ్యం అవుతున్నాయి. జలుబు,దగ్గు వంటి తేలికపాటి లక్షణాలని తగ్గించడానికి రోగనిరోధక శక్తి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే డ్రింక్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో 4 మిరియాలు,4 లవంగాలు,ఒక యాలక్కాయ,అరస్పూన్ వాము,4 తులసి ఆకులు,చిన్న అల్లం ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. ఈ డ్రింక్ ని వడకట్టి తాగాలి. ఈ విధంగా ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడూ తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది.
రెండు రోజుల పాటు తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.