Rangasthalam Movie :రంగస్థలం సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో…?
Power star Ram Charan Rangasthalam Movie : రంగస్థలం సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా ఘన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు అందరు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా కథను సుకుమార్ రామ్ చరణ్ కంటే ముందుగా మరో హీరో వద్దకు తీసుకువెళ్లాడు.
సుకుమార్ ‘రంగస్థలం’ సినిమాకథను మొదటగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వినిపించాడట. అంతేకాక ఈ కథను ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకొని రాసాడట. ఎన్టీఆర్ తో సుకుమార్ నాన్నతో ప్రేమతో సినిమా తీస్తున్న సమయంలోనే సుకుమార్ ఈ కథ లైన్ ని ఎన్టీఆర్ కి వినిపించాడు. అయితే ఎన్టీఆర్ పెద్దగా రెస్పాండ్ కాలేదు.
దాంతో సుకుమార్ కథలో అనేక మార్పులు చేసి రామ్ చరణ్ కి వినిపించాడు. రామ్ చరణ్ కి సుకుమార్ చెప్పటం రామ్ చరణ్ ఒకే చెప్పటం చకచకా జరిగిపోయాయి. సినిమా హిట్ అయ్యాక చూసి ఎన్టీఆర్ సుకుమార్ చెప్పిన కథలో ఇంత పట్టు ఉందా అని ఆశ్చర్యపోయాడట.