Rajasekhar:రాజశేఖర్ కెరీర్ ని నిలబెట్టిన సూపర్ హిట్ సినిమాలు
Rajasekhar Hit Movies : ప్రతి అభిమాని తమ అభిమాన నటుని గురించి వివరాలు తెలుసుకోవటానికి చాలా ఆసక్తిగా ఉంటారు. 90 వ దశకంలో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి నలుగురు స్టార్ హీరోలతో పోటీ పడి నిలబడిన స్టార్ రాజశేఖర్. విభిన్నమైన, ప్రయోగాత్మక పాత్రలను పోషిస్తూ కుటుంబ,యువ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. రాజశేఖర్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల మీద ఒక లుక్ వేద్దాం.
ఎవడైతే నాకేంటి
2007 లో విడుదల అయినా ‘ఎవడైతే నాకేంటి’ సినిమా రాజకీయ వ్యవస్థలో ఉన్న లొసుగులను చూపింది. ఈ సినిమాకి కథ మరియు స్క్రీన్ ప్లే రాజశేఖర్ నిర్వహించాడు. రాజశేఖర్ భార్య ఒకప్పటి నటి జీవిత దర్శకత్వం వహించారు. లోక్ సత్తా నాయకుడు జయ్ ప్రకాష్ నారాయణ్ కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు.
శేషు
2002 లో వచ్చిన ‘శేషు’ రాజశేఖర్ చేసిన ఒక మంచి ప్రయత్నం అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ ఫలితాన్ని పెడితే, రాజశేఖర్ నటన సామర్ధ్యం పూర్తిగా ఈ సినిమా ద్వారా బయటకు వచ్చింది. జీవిత దర్శకత్వం వహించగా, తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కి మొదటి సినిమా. ఇది తమిళ సినిమా ‘సేతు’ కి రీమేక్.
మా అన్నయ్య
2000 లో వచ్చిన ‘మా అన్నయ్య’ కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసుకొని తీసిన సినిమా. రాజశేఖర్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాజశేఖర్ ఈ సినిమాలో కుటుంబం కోసం త్యాగం చేసే పాత్రలో నటించాడు.
శివయ్య
1998 లో వచ్చిన ‘శివయ్య’ కూడా కుటుంబ ప్రేక్షకులకు దగ్గర అయింది. రాజశేఖర్ కెరీర్ లో అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కోర్టు సీన్ చాలా హైలెట్.
ఓంకారం
1997 లో వచ్చిన ‘ఓంకారం’ సినిమా రాజశేఖర్ కెరీర్ లో వైవిధ్యమైన సినిమా. బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదని అనిపించినా నటన పరంగా రాజశేఖర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా ద్వారానే కన్నడ డైరెక్టర్,హీరో ఉపేంద్ర తెలుగులో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
అన్న
1994 లో వచ్చిన ‘అన్న’ సినిమా రాజశేఖర్ కెరీర్ లో అత్యంత శక్తివంతమైన సినిమా. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం తన అభిమాన దర్శకుడు ముత్యాల సుబ్బయ్యతో రాజశేఖర్ చేతులు కలిపాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాను 1995 IIFA చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు.
అల్లరి ప్రియుడు
1993 లో విడుదల అయిన ‘అల్లరి ప్రియుడు’ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా రాజశేఖర్ కెరీర్ ని మంచి స్థితికి వెళ్లేలా చేసింది. రాజశేఖర్,మధుబాల,రమ్యకృష్ణ ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.
అంకుశం
1990 లో వచ్చిన ‘అంకుశం’ సినిమాలో నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ గా నటించి అందరి మనస్సులోని పోలీస్ అంటే ఇలా ఉండాలని అనిపించేలా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో నటించిన రామిరెడ్డికి బెస్ట్ విలన్ గా నంది పురస్కారం లభించింది.
ఆహుతి
1988 లో వచ్చిన ‘ఆహుతి’ సినిమాలో రాజశేఖర్ అవినీతిపరుడైన రాజకీయ నాయకులతో పోరాటం చేసే కోపిష్టి యువకుడిగా నటించాడు. ఈ సినిమాలో నటించిన దాదాపుగా అందరికి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.
శృతిలయలు
కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 1987 లో వచ్చిన శృతిలయలు సినిమా రాజశేఖర్ ని కొత్తగా చూపించింది. ఈ సినిమాలో యువ సంగీత కళాకారుడిగా బాగా నటించి మెప్పించాడు.
మగాడు
1990 లో వచ్చిన ‘మగాడు’ సినిమాలో రాజశేఖర్,జీవితతో కలిసి నటించాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రాజశేఖర్ కి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది.
వందేమాతరం
టి. కృష్ణ దర్శకత్వంలో 1985 లో ‘వందేమాతరం’ సినిమా ద్వారా రాజశేఖర్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. 1985 లో విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా విజయంతో రాజశేఖర్ కి టాలీవుడ్ లో సెటిల్ అవ్వటానికి ఎంతో సమయం పట్టలేదు.