Hair Care Tips:ఈ పొడితో ఇలా చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి 3 రెట్లు వేగంగా జుట్టు పెరుగుతుంది
Hair Fall Home Remedies In telugu : జుట్టు రాలే సమస్య ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. జుట్టు రాలే సమస్య కనబడగానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన వాటిలో ఉండే కెమికల్స్ కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
మన ఇంటిలో ఉండే కొన్ని సహజసిద్దమైన పదార్థాలతో చాలా సులభంగా చుండ్రు, తలలో దురద, జుట్టు రాలే సమస్య వంటి అన్ని రకాల జుట్టుకి సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు. దీని. కోసం ఒక బౌల్ లో మూడు స్పూన్ల మందార పొడి, మూడు స్పూన్ల ఉసిరికాయ పొడి, ఒక నిమ్మకాయ రసం, ఒక గుడ్డు లోని పసుపు మరియు తెలుపు సొనలను వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత రెండు స్పూన్ల పులిసిన పెరుగును వేసి కలపాలి. అన్ని ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలుపుకొని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట తర్వాత కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది. .
జుట్టు రాలడానికి కారణమైన చుండ్రు సమస్యను, తలలో దురద సమస్యను కూడా చాలా సమర్థవంతంగా తగ్గిస్తుంది. మందార పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. అయితే మందారపువ్వులను ఎండబెట్టి పొడిగా చేసుకుంటే మంచిది. ఉసిరి పొడి కూడా మార్కెట్ లో లభ్యం అవుతుంది. అలా కాకుండా ఉసిరి కాయలను ఎండబెట్టి పొడిగా చేసుకోవచ్చు.
ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ ప్యాక్ లో తీసుకున్న అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు రాలే సమస్యను తగ్గించటమే కాకుండా తలలో దురద,చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తాయి. కాబట్టి మీరు కూడా ఈ ప్యాక్ ని ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.