Uric acid:యూరిక్ యాసిడ్ ఉన్నవారు ఈ జ్యూస్ తీసుకుంటే…ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు…
Bottle gourd juice for uric acid: ఈ రోజుల్లో సమస్యలు చాలా సులభంగా వస్తున్నాయి. అయితే ఆ సమస్యలను తగ్గించుకోవటానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి సమస్యలలో యూరిక్ యాసిడ్ సమస్య ఒకటి. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు కీళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లు వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మందులను వాడాల్సిందే.
ఈ సమస్యలు ఉన్నప్పుడు ముందుగా యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎలా ఉన్నాయో పరీక్ష చేయించుకోవాలి. దాన్నిబట్టి డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే ఆయుర్వేద రెమిడీని కూడా ఫాలో అయితే చాలా తొందరగా ఈ సమస్య నుంచి బయటపడతారు. మనం తీసుకునే ఆహారంలో ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.
ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఒకవేళ విసర్జన సరిగ్గా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది. అవి క్రమంగా స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది. ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది.
యూరిక్ యాసిడ్ ని తగ్గించటానికి ఇప్పుడు చెప్పే జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది.
సొరకాయ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. సొరకాయను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కలు ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్ లో వేసి ఒక కప్పు నీటిని పోసి మిక్సీ చేసి జ్యూస్ ని వడకట్టాలి. ఈ జ్యూస్ లో పావు స్పూన్ వాము పొడి, పావు స్పూన్ లో సగం మిరియాల పొడిని వేసి బాగా కలపాలి.
ఈ జ్యూస్ తీసుకుంటూ ఉంటే క్రమంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. అయితే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నప్పుడూ మందులు మాత్రం తప్పనిసరిగా వాడాలి. అలా వాడుతూ ఇలా చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఫలితం పొందవచ్చు. మిరియాలు, వాములో ఉన్న లక్షణాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడతాయి. ఈ జ్యూస్ ని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.