kitchen Tips:నిమ్మకాయలు ఎండిపోయాయని బయట పాడేస్తున్నారా… ఈ విషయం తెలిస్తే..
Dried Lemons Uses in telugu:నిమ్మకాయలను ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి నిమ్మకాయలు ఎండిపోతు ఉంటాయి. మనలో చాలా మంది ఎండిపోయిన నిమ్మకాయలను బయట పాడేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పే చిట్కాలను చూస్తే అస్సలు బయట పాడేయరు.
మురికిగా ఉన్న చాపింగ్ బోర్డ్ ను శుభ్రం చేయటానికి ఎండిపోయిన నిమ్మకాయలను ఉపయోగించవచ్చు. దీని కోసం చాపింగ్ బోర్డ్ మీద కొంచెం ఉప్పు జల్లి నిమ్మకాయని సగానికి కట్ చేసి ఆ నిమ్మ చెక్కతో రుద్దాలి. దాంతో చాపింగ్ బోర్డ్ చాలా క్లీన్ గా మారుతుంది.
వంటగదిలో చాలా రోజులుగా అలా పక్కన పెట్టేసిన వస్తువులు జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. అలా జిడ్డు పేరుకుపోయిన వస్తువులను క్లీన్ చేయటానికి ఎండిన నిమ్మకాయలు సహాయపడతాయి. దీని కోసం నిమ్మకాయను సగానికి కట్ చేసి ఆ పాత్రపై రుద్ది శుభ్రంగా కడిగితే జిడ్డు చాలా సులభంగా తొలగిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.