Hair growth tips:ఉల్లిపాయ రసంలో ఈ నూనె కలిపి జుట్టుకి రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది
Hair growth tips In Telugu : ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనబడుతోంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. కానీ వాటిల్లో కెమికల్స్ ఉండటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. .
అలా కాకుండా మన వంటగదిలో ఉండే వాటితోనే హెయిర్ టానిక్ తయారు చేసుకొని ఒక పది రోజులు ఉపయోగిస్తే జుట్టు రాలే సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. దీని కోసం మనం కేవలం రెండు ఇంగ్రిడియంట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. జుట్టు సంరక్షణలో ఉల్లిపాయ చాలా బాగా సహాయపడుతుంది.
ఒక మీడియం సైజ్ లో ఉల్లిపాయను తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి రసం తీయాలి. ఈ రసాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి రెండు నిమిషాలు మసాజ్ చేసి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య అన్నీ తొలగిపోయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఉల్లి పాయలో సల్ఫర్, కేరాటిన్ సమృద్దిగా ఉండుట వలన చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టుకి అవసరమైన పోషకాలు అంది జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
బాదం నూనెలో విటమిన్ ఇ సమృద్దిగా ఉండుట వలన జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. ఉల్లిపాయ,బాదం నూనె చాలా సులువుగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.