Fennel seeds :భోజనం చేసిన తర్వాత సోంపు తింటున్నారా…. ఈ 4 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు
fennel seeds benefits In Telugu : మనలో చాలా మంది భోజనం చేసిన తర్వాత సొంపు తింటూ ఉంటారు. ఈ విధంగా సోంపు తినటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. సోంపు గింజలు జీలకర్రను పోలి ఉంటాయి. సోంపు గింజలను వంటల్లోనే కాకూండా అనేక రకాల మందుల తయారీలో ఉపయోగిస్తారు.
ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సోంపు గింజలను తినటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వటానికి గ్యాస్ట్రిక్ కు సంబంధించిన ఆమ్లాలు బాగా ఉత్పత్తి అవుతాయి. దాంతో పొట్టకు సంబందించిన సమస్యలు రాకుండా ఉంటాయి. బరువు తగ్గాలని అనుకొనే వారికీ సోంపు మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు.
సోంపు తినటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి త్వరగా వేయదు. దాంతో తీసుకొనే ఆహారం తగ్గటం వలన బరువు తగ్గుతారు. సోంపు గింజలలో హిమోగ్లోబిన్ తయారికి అవసరం అయిన ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తానికి సంబందించిన ఎన్నో పదార్ధాల తయారీకి సోంపు బాగా సహాయపడుతుంది.
సోంపు రెగ్యులర్ గా తీసుకోవటం వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. సోంపు గింజలను నమలడం వల్ల లాలాజలములో నైట్రైట్ శాతం పెరుగు తుంది. ఇది రక్తపోటుని సాధారణంగా ఉండేలా చూస్తుంది. సోంపు గింజల్లో పొటాషియం కూడా అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో నీటిని సమతుల్యతతో ఉండేలా చూస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే పొటాషియం చాలా ముఖ్యం.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.