5 నిమిషాల్లో పళ్లపై ఉన్న గార, పసుపు మొత్తం తొలగిపోయి తెల్లగా మెరుస్తాయి
Teeth whitening tips : పళ్ళు తెల్లగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పసుపుపచ్చగా, గార పట్టిన పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. చాలా తక్కువ ఖర్చుతో సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
ఒక బౌల్ లో 4 వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ గా చేసుకొని వేసుకోవాలి. ఈ పేస్ట్ లో పావు స్పూన్ లో సగం ఉప్పు,పావుస్పూన్ లో సగం పసుపు, ఒక స్పూన్ ఆవనూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో పళ్లను రుద్దాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే చాలా తక్కువ సమయంలోనే పంటి మీద గార,పసుపు తొలగిపోతుంది.
వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు పళ్లపై ఉన్న పసుపు రంగుని పోగొట్టి తెల్లగా మార్చటంలో సహాయ పడతాయి. ఇక ఉప్పులో ఉండే లక్షణాలు పసుపుని, దుర్వాసనను తొలగించటానికి,పసుపులో ఉన్న లక్షణాలు పళ్ళ పై ఉన్న బ్యాక్టీరియాను తొలగించటానికి సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
Amazon Best Offers
https://amzn.to/3zgeuGf