Beauty Tips

Hair Fall Tips:ఇలా చేస్తే చాలు జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు 3 రేట్లు వేగంగా పెరుగుతుంది

Hair Fall Tips : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్య రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సమర్ధవంతంగా జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.

రెండు స్పూన్ల మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను మెత్తని పేస్ట్ గా తయారుచేసుకోవాలి. రెండు స్పూన్ల ఆవిసే గింజలను గిన్నెలో వేసి నీటిని పోసి పొయ్యి మీద 5 నిమిషాలు ఉంచితే జెల్ తయారవుతుంది. వేడిగా ఉన్నప్పుడే ఈ జెల్ ని ఒక బౌల్ కి వడకట్టాలి.
Flax seeds

ఒక బౌల్ మెంతుల పేస్ట్, ఆవిసే గింజల జెల్, రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
fenugreek seeds
ఈ చిట్కాకు ఉపయోగించిన అన్నీ పదార్ధాలు జుట్టుకి మంచి పోషణ అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.