Beauty Tips

Young Look:40 లో కూడా 20 వలే ముడతలు లేకుండా యంగ్ లుక్ లో మెరవాలంటే ఇలా చేయండి

Face Young Look Tips In telugu : వయస్సు పెరిగే కొద్ది చర్మం మీద ముడతలు, వృద్ధాప్య లక్షణాలు రావటం సహజమే. కానీ కొంతమంది ఎంత వయసు వచ్చినా యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు. అలా వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా యవ్వనంగా కనపడాలంటే ఇప్పుడు చెప్పే రెమెడీని ఫాలో అయితే సరిపోతుంది.
Banana Peel benefits in telugu
ముందుగా ఈ రెమిడీ కోసం అరటిపండు తొక్కను తీసుకుని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరటిపండు తొక్కలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ విషయం మనలో చాలా మందికి తెలియక పాడేస్తూ ఉంటారు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కొంచెం వేడి అయ్యాక అరటిపండు తొక్క ముక్కలు, రెండు స్పూన్ల ఓట్స్ వేసి 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకోవాలి.
oats benefits
ఉడికిన అరటిపండు తొక్కలు, ఓట్స్ మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని వడకట్టి క్రీమ్ ని సపరేట్ చేయాలి. క్రీమ్ ని ఒక బౌల్ లో తీసుకొని దానిలో ఒక స్పూన్ మిల్క్ పౌడర్, ఒక స్పూన్ పచ్చిపాలు, అర స్పూన్ బాదం నూనె వేసి అన్ని బాగా కలిసేలా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాలయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ముఖానికి ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే వృద్ధాప్య ఛాయలు క్రమంగా మాయం అయ్యి చర్మం యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది.
Young Look In Telugu
చాలా తక్కువ ఖర్చుతో ఈ రెమెడీని ఫాలో అయితే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. చాలా మంది ఇంటి చిట్కాలను పెద్దగా పట్టించుకోరు. కానీ ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే చాలు. వేలకొద్ది డబ్బును ఖర్చును పెట్టవలసిన అవసరం లేదు. ఈ చిట్కా చేయటం కూడా సులువే.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు