LIC Aadhaar Shila : మహిళల కోసం ఎల్ఐసీ అద్భుతమైన స్కీమ్.. రోజుకు రూ. 29 పెట్టుబడి పెడితే..
LIC:రోజుకు 29 ఇన్వెస్ట్ చేస్తే చాలు.. చేతికి ఎంత వస్తాయో తెలుసా.. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి కొంత సొమ్మును పొడుపు చేయవలసిన అవసరం ఉంది. మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి వస్తుంది.
మంచి పధకం LIC లో ఉంది. LIC ఎప్పటికప్పుడు మంచి మంచి పధకాలను ప్రవేసపెడుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సూపర్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ లో రోజుకు 29 పెట్టుబడిపెడితే చేతికి 4 లక్షలు వస్తాయి.
ఎల్ఐసీ ప్రవేశపెట్టిన ఆధార్ శిలా యోజన.. మహిళల కోసం తీసుకొచ్చిన పథకం. ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళ ఈ పధకంలో చేరవచ్చు. ఈ స్కీమ్ కనీస మెచూరిటీ టైమ్ 10 ఏళ్లుగా ఉండగా.. గరిష్ఠ వ్యవధి 20 ఏళ్లుగా ఉంది.
ఎల్ఐసీ ప్రవేశపెట్టిన ఆధార్ శిలా యోజన పథకంలో 30 ఏళ్ల వయసు ఉన్న మహిళ 20 ఏళ్ల పాటు రోజుకు రూ.29 పెట్టుబడి పెడితే.. రూ.2,11,170 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ బెనిఫిట్‌గా రూ.4 లక్షలు అందుకోవచ్చు.
పాలసీ పూర్తయ్యే నాటికి మహిళల వయసు 70 ఏళ్లు దాటకూడదు. 8 ఏళ్ల బాలికల నుంచి నుంచి 55 ఏళ్ల మహిళ వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకుంటే నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా సంవత్సరానికి ఓసారి ప్రీమియం చెల్లించవచ్చు.
మరింత సమాచారం కోసం LIC వారిని కాంటాక్ట్ అవ్వాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.