Beauty Tips

Hair Care Tips:ఒక్క వెంట్రుక కూడా రాలకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా మెరిసేలా చేస్తుంది…ఇది నిజం

Best Hair Growth Paste : జుట్టు రాలే సమస్యను తగ్గించటానికి జామ ఆకులు చాలా బాగా సహాయపడతాయి. జామ ఆకులు జుట్టు ఫోలికల్స్ ను స్ట్రాంగ్ గా ఉంచి జుట్టు రాలకుండా నిరోదిస్తుంది. జామ ఆకుల్లో విటమిన్ సి ఉండుట వలన కొల్లాజెన్ ఆరోగ్యంగా ఉండటానికి మరియు విచ్ఛిన్నం కాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.
Hair fall tips
చర్మం లోపలి పొరల్లో కొల్లాజెన్ ఉంటుంది. ఇది మెష్ లాంటి నిర్మాణం, ఇది చర్మానికి బిల్డింగ్ బ్లాక్‌గా పనిచేస్తుంది. కాబట్టి దీనిని కొల్లాజెన్ ఎలాస్టిన్ మెష్ అంటారు. ఈ మెష్ హెయిర్ ఫోలికల్స్‌ని కలిపి ఉంచుతుంది. వాటిని బలహీనపడకుండా నిరోదించి జుట్టు రాలడాన్ని అపుతుంది. జామ ఆకులలో ఉండే లైకోపీన్ అనే రసాయన సమ్మేళనం UV కిరణాల నుండి జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది.
hair fall tips in telugu
జామ ఆకులలో ఉండే క్వెర్సెటిన్ అనే రసాయన సమ్మేళనం హెయిర్ ఫోలికల్స్ మరియు హెయిర్ సెల్స్‌పై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా జుట్టు కణాల జీవితకాలం తగ్గుతుంది. జామ ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి. అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
cococnut Oil benefits in telugu
జామ ఆకులతో నూనెను తయారుచేసుకొని వాడవచ్చు. జామాకుల రసంలో కొబ్బరి నూనె,ఉసిరి నూనె వేసి బాగా మరిగించి వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రాత్రి సమయంలో తలకు బాగా పట్టించి cap పెట్టుకొని మరుసటి రోజు ఉదయం కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.