Healthhealth tips in telugu

Good Sleep:పాలల్లో ఈ పొడిని కలిపి తాగితే గాఢ నిద్ర పడుతుంది…

How to sleep fast in 5 minutes In Telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనలో చాలా మంది ఒత్తిడి, మానసిక ఆందోళన కారణంగా నిద్రకు దూరం అవుతున్నారు. కొంతమంది నిద్ర మాత్రలకు అలవాటు పడుతున్నారు. మరికొంతమంది ఇంట్లోనే కొన్ని రకాల చిట్కాలు పాటించి నిద్ర పట్టేలా చేసుకుంటున్నారు.

ఇప్పుడు చెప్పే చిట్కా మంచి నిద్ర వచ్చేలా చేయడమే కాకుండా మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అలాగే మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎండు ఖర్జూరాలను 200 గ్రాములు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాదం పప్పులను 100 గ్రాములు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరాలు, కట్ చేసి పెట్టుకున్న బాదంపప్పులు, 50 గ్రాముల గుమ్మడి గింజలు, 25 గ్రాములు గసగసాలు వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ పొడి కలిపి తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతో పాటు మంచి నిద్ర కూడా వస్తుంది.

బాదం పప్పులో ఉండే మెలటోనిన్ నిద్ర పట్టటానికి సహాయపడుతుంది. గుమ్మడి గింజలలో ఉండే ఒక అమైనో ఆమ్లం నిద్ర పట్టేలా చేస్తుంది. గసగసాలలో మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన ఒత్తిడి హార్మోన్ అయిన కారిస్టాల్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది. ఈ పాలను తాగి మంచి నిద్రను సొంతం చేసుకొని నిద్రలేమి సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.