Devotional

Dog Crying: ఇంటి ముందు కుక్క వచ్చి మొరిగితే ఏం జరుగుతుందో తెలుసా?

Dog Crying:పూర్వ కాలంలో శకునాలకు చాలా ప్రాధాన్యత ఉండేది. కుక్కలు మన ముందుకు ఎలా వచ్చి కనిపిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు కుక్కల శకునం ద్వారా తెలుసుకుందాం. నల్లని కుక్క మనకు ఎదురుగ వస్తే ధన లాభం కలుగుతుంది.

వేరే ఊరు వెళుతున్న వ్యక్తికీ కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్వ్యక్తికి ధన ప్రాప్తి కలుగుతుందని చెప్పుతారు. కుక్క కుడి కన్నుతో మనల్ని చూస్తే కష్టమైన పనులు సులభంగా జరుగుతాయి.

కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చొని కుడి కాలితో తల గోక్కుంటే కార్య సిద్ది జరుగుతుంది. బయటకు వెళుతున్న వ్యక్తికీ మాంసం ముక్క నోటితో పట్టుకున్న కుక్క కనపడితే ఆ వ్యక్తికీ కష్టం కలుగుతుందనిఅర్ధం . కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలి కుడి వైపు గోక్కుంటే శుభం జరుగుతుంది.

మనం బయటకు వెళ్ళినప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకుంటూ ఉంటే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్ధం. కుక్క మన చెప్పులు తీసుకువెళ్లిన,వేరే వారివి మన ఇంటికి తెచ్చిన మనకు మంచి జరగదని అర్ధం.

కుంటి కుక్క కనపడితే అనుకున్న పనులు జరగవు. కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్ధం. ముందుకి కుక్క వచ్చి మొరిగితే ధన ప్రాప్తి కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.